VBG Ramji Scheme | ఉపాధి కూలీలకు ఊరట.. జిల్లాలో జోరుగా వీబీ జీ రామ్‌జీ పనులు

పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘వీబీ జీ రామ్‌జీ’ పథకం కింద జిల్లాలో పనులు ఊపందుకున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: VBG Ramji Scheme | పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘వీబీ జీ రామ్‌జీ’ పథకం కింద జిల్లాలో పనులు ఊపందుకున్నాయి. ఎల్​నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వర్షాలు క్రమం తప్పి కురుస్తుండటంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలంతా ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.

జూలై నెలలో ప్రారంభమైన ఈ పథకం కింద గడిచిన పనిదినాల్లో ఏకంగా 4 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. గత ఆర్థిక మొత్తం వానాకాలం సీజన్‌లోనూ లక్ష దాటని పనిదినాలు ఈసారి స్వల్ప వ్యవధిలోనే 4 లక్షలకు చేరడం విశేషం. జిల్లా (Nizamabad) వ్యాప్తంగా ఈ ఏడాది కూలీలకు మొత్తం 11లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత వేగాన్ని పరిశీలిస్తే మిగిలిన 7లక్షల పనిదినాలను పూర్తి చేయడం సులభమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో రోజుకు 2వేల మంది కూలీలు కూడా రావడం కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో రోజుకు 5వేల నుంచి 6వేల మంది వరకు పనులకు హాజరవుతున్నారు.

VBG Ramji Scheme | రూ.97 కోట్ల వేతనాలు..

ఇప్పటివరకు పనుల్లో పాల్గొన్న కూలీలకు రూ.97కోట్ల వరకు వేతనాలు చెల్లించగా, మరో రూ. 1.35 కోట్లు రావాల్సి ఉంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో పనిదినాల సంఖ్యను ఇంకా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మరొకవైపు ఎల్​నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉండటంతో తాగు, సాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఊటకుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను అధికారులు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత, సామూహిక ఊటకుంటల నిర్మాణాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

VBG Ramji Scheme | జిల్లా ఉపాధి పనుల వివరాలివే..

మొత్తం జాబ్‌కార్డులు 2,54,910 ఉండగా.. యాక్టివ్ జాబ్‌కార్డులు 1,49,478 ఉన్నాయి. మొత్తం కూలీలు 4,68,961 ఉండగా.. యాక్టివ్ కూలీలు: 2,21,792 ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు వీబీ జీరామ్​జీ పథకంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వారన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Road Repairs | కామారెడ్డిలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *