Crude Oil Prices| చమురు సంస్థలకు రూ.30 వేల కోట్ల నష్టం.. భారం పడకుండా కేంద్రం కీలక వ్యూహం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Crude Oil Prices| పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఫిబ్రవరి చివరలో ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బ్యారెల్ ధర 70 డాలర్లుగా ఉండగా, అది కాస్తా ప్రస్తుతం 100 డాలర్ల మార్కును దాటేసింది. ఒకానొక దశలో ఇది ఏకంగా 144 డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా ధరలు 50 శాతం మేర పెరిగినప్పటికీ, దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం (HPCL) ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. దీనివల్ల మార్చి మధ్య కాలం నుండి ఇప్పటివరకు ఈ మూడు కంపెనీలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Crude Oil Prices|ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ఊరట..

వాస్తవానికి ఈ నష్టాల భారతం రూ.62,500 కోట్ల వరకు ఉండాల్సి ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల కంపెనీల నష్టాలు కొంత మేర తగ్గాయి. రవాణా నౌకల దారి మళ్లింపు, భారీగా పెరిగిన బీమా ప్రీమియం ఖర్చులను కూడా ఈ కంపెనీలే భరించాల్సి రావడం గమనార్హం.

Crude Oil Prices|పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న నౌకలు..

హర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఆటంకాల వల్ల సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది. సుమారు 1,500 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోవడం రవాణా ఇబ్బందులకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇంధన ధరలను భారీగా పెంచినప్పటికీ, భారత్ మాత్రం వినియోగదారులపై భారం పడకుండా విభిన్నమైన వైఖరిని అవలంబించింది.

ఇది కూడా చదవండి: Kodangal Development | రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *