అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kodangal Development | అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కొడంగల్‌లో వేంకటేశ్వర స్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 225 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.
Kodangal Development | పరిశ్రమల ఏర్పాటు
మక్తల్ – నారాయణపేట – కొడంగల్‌కు నీళ్లు, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం వచ్చిందని సీఎం అన్నారు. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతానికి రానున్నాయని చెప్పారు. మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసి, కృష్ణా నది జలాలతో ఈ ప్రాంత భూములు తడపాలన్నారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తయిందని, పనులు ముందుకు సాగాలన్నారు. కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్‌కు కూడా కేంద్రం సూత్రపాయంగా అంగీకరించిందని తెలిపారు. టేకులగోడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. దీంతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు. లగచర్లలో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

