Kejriwal Sheesh Mahal | కేజ్రీవాల్ ‘శీష్ మహల్’లో.. రూ.11 లక్షల షాండిలియర్.. రూ.5 లక్షల సోఫా

సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ అధికారిక నివాసం కోసం రూ.56 కోట్లు చేశారని బీజేపీ ఆరోపించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kejriwal Sheesh Mahal | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అధికారిక నివాసంలో ఫర్నిచర్​ కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. విలాసవంతమైన ఈ భవనాన్ని అధికారిక బీజేపీ ప్రభుత్వం (BJP Government) శుక్రవారం మీడియాకు చూయించింది. అందులో వస్తువుల కోసం వెచ్చించిన మొత్తాన్ని వివరించింది.

ఆ భవనంలో రూ.11.56 లక్షల విలువైన షాండిలియర్​ (సీలింగ్‌కు వేలాడదీసే అలంకారపు లైటింగ్) ఏర్పాటు చేయడం గమనార్హం. రూ. 5.47 లక్షల విలువైన రెండు సీట్ల సోఫా, రూ. 2.42 లక్షల విలువైన రిక్లైనర్‌ను ఢిల్లీ మంత్రి పర్వేష్​ వర్మ మీడియాకు చూపించారు. ప్రజాధనాన్ని అరవింద్ కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారన్నారు. ఆయన ప్రభుత్వ వాహనాన్ని గానీ, ప్రభుత్వ నివాసాన్ని గానీ ఉపయోగించనని చెప్పేవారని, కానీ ఈ నివాసం కోసం ఏకంగా రూ. 56 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.

Kejriwal Sheesh Mahal | కోవిడ్​ సమయంలో..

కోవిడ్ సమయంలో ప్రజలు చనిపోతున్నప్పుడు ఆప్ నాయకుడు ‘శీష్ మహల్’ నిర్మించారని ఆరోపించారు. అందులో ఓ గదిలో మాత్రం చిరిగిన సీటు ఉన్న ఒక చెక్క కుర్చీ ఉంది. ఈ గదిలో కూర్చొని కేజ్రీవాల్​ తాను ఎంత సాదాసీదా జీవితం గడుపుతున్నట్లు ప్రజలకు ఫేస్​బుక్​ లైవ్​లో వీడియోలు చేసేవారన్నారు. ఆ భవనంలో ఎనిమిది బెడ్​ రూమ్​లు, 12 టాయిలెట్లు, ఒక జాకుజీ బాత్, స్పా, ఖరీదైన కార్పెట్లు, ఐదు ఓఎల్‌ఈడీ టీవీలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వచ్చే వారం ‘శీష్ మహల్’ను ప్రజల సందర్శనార్థం ప్రభుత్వం తెరుస్తుందని వర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Sanjay Raut | యూపీ సీఎం యోగిపై సంజయ్​ రౌత్​ ప్రశంసలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *