Sanjay Raut | యూపీ సీఎం యోగిపై సంజయ్​ రౌత్​ ప్రశంసలు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్​ రౌత్​ ప్రశంసించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sanjay Raut | నిత్యం బీజేపీపై విమర్శలు చేసే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్​ రౌత్​ తాజాగా ఉత్తర ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ (CM Yogi Adityanath)పై ప్రశంసలు కురిపించారు. ఆయన సమర్థుడైన నాయకుడని, హిందుత్వకు చెందిన అత్యున్నత ప్రతినిధులలో ఒకరన్నారు.

యూపీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై చర్చ జరుగుతోంది. దీనిపై సంజయ్​ రౌత్​ స్పందిస్తూ.. “ఆయన సమర్థుడైన వ్యక్తి. మాకు కూడా యోగిజీ అంటే ఇష్టం. ఆయన అందరికంటే ఉన్నతంగా నిలిచే హిందుత్వ ప్రతినిధి. యోగి అయితే యూపీ; యోగి లేకపోతే యూపీ లేదు” అన్నారు.

Sanjay Raut | డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో..

2027 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరో పార్టీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడంతో చర్చ ప్రారంభం అయింది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని అంగీకరిస్తూనే, 2027 ఎన్నికల తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగాలా లేక వేరొకరు బాధ్యతలు స్వీకరించాలా అనేది శాసనసభ్యులే నిర్ణయించాల్సి ఉంటుందని మౌర్య అన్నారు. ఆయన ఆదిత్యనాథ్‌కు తన మద్దతును పునరుద్ఘాటించారు. మరోవైపు యోగి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసని అన్నారు. అయితే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తే మరోసారి కమలం పార్టీ యోగినే సీఎం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

Sanjay Raut | గతంలో సైతం..

గత ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. 2017 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత, బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ పేరును ఖరారు చేశారు. 2022లో కూడా బీజేపీ ఇదే పద్ధతిని అనుసరించింది. దీంతో ఈ ఎన్నికల్లో సైతం సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లనున్నారు. అనంతరం అధికారంలోకి వస్తే యోగినే సీఎం చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Jharkhand Double Murder | తోటి కోడళ్ల మధ్య గొడవ.. హత్య చేసిన భర్తలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *