Jharkhand Double Murder | తోటి కోడళ్ల మధ్య గొడవ.. హత్య చేసిన భర్తలు

తోటి కోడళ్ల మధ్య గొడవలతో ఆగ్రహం చెందిన భర్తలు వారిని హత్య చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jharkhand Double Murder | తోటి కోడళ్లు నిత్యం గొడవ పడుతున్నారు. ఏళ్లుగా ఇద్దరి మధ్య వివాదాలు ఉండటంతో వారి భర్తలు ఇద్దరిని హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్​లో చోటు చేసుకుంది.

జార్ఖండ్‌ (Jharkhand)లోని గుమ్లాలో తమ భార్యలను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ మహిళల మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన శివ శంకర్ సాహు అంబులెన్స్​ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అతడికి సోదరుడు నవీన్​ సాహూ ఉన్నారు. వారి భార్యలు మినీ ప్రియ (28), రాధిక కుమారి (20) మధ్య కొన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి. దీంతో వారిని ఇద్దరు సోదరులు సోమవారం హత్య చేశారు.

Jharkhand Double Murder | అటవీ ప్రాంతంలో..

హత్య అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లో తరలించి, పొరుగున ఉన్న సిమ్‌డేగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో పాతి పెట్టారు. అనంతరం తమ భార్యలు ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు విచారించగా.. తామే హత్య చేశామని అంగీకరించారు. దీంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల తల్లిదండ్రులైన సామేశ్వర్ సాహు, తిలేశ్వరి దేవిలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Congress Petition Against Meta | సోషల్ మీడియా వేదికపై రాజకీయ రగడ.. మెటా (Meta)పై ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్! రాహుల్ గాంధీ పోస్టుల నియంత్రణపై తీవ్ర ఆరోపణలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *