Husband Murder Case | వేధింపులు తాళలేక భర్తను కడతేర్చిన భార్య

నిత్యం తనను వేధిస్తుండడంతో విసుగుచెందిన భార్య తన భర్తను కడతేర్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్: Husband Murder Case | నిత్యం తనను వేధిస్తుండడంతో విసుగుచెందిన భార్య తన భర్తను కడతేర్చింది. ఈ ఘటన నందిపేట్​ (Nandipet) గ్రామంలోని రాజ్​నగర్​లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

Husband Murder Case | రాజ్​నగర్​ దుబ్బ ఏరియాలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ గ్రామంలోని రాజ్ నగర్ దుబ్బ ఏరియాలో నివాసముండే గోసం గంగాధర్ (46) నిత్యం మద్యం సేవిస్తుండేవాడు. అనంతరం తన భార్య సుమలతతో గొడవపడేవాడు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం సాయంత్రం సైతం మద్యంతాగిన అనంతరం భార్యపై దాడికి యత్నించడంతో ఆమె ఇంట్లోనే గొంతునులిమి హత్య చేసింది. అతను పెట్టే బాధలు భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు.

ఇది కూడా చదవండి..: Bikkanoor Sarpanch Attack Case | పంచాయతీ కార్యాలయంలో ఉద్రిక్తత.. సర్పంచిపై దాడికి యత్నం, బెదిరింపులు! వార్డు సభ్యుడిపై కేసు నమోదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *