Bikkanoor Sarpanch Attack Case | పంచాయతీ కార్యాలయంలో ఉద్రిక్తత.. సర్పంచిపై దాడికి యత్నం, బెదిరింపులు! వార్డు సభ్యుడిపై కేసు నమోదు

గత కొన్ని రోజులుగా వివిధ వాట్సాప్ గ్రూపులలో తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ, తన వ్యక్తిగత గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని సర్పంచి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bikkanoor Sarpanch Attack Case | కామారెడ్డి జిల్లా భిక్కనూరులో గ్రామ పంచాయతీ వ్యవహారాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రామ సర్పంచ్‌పై దురుసుగా ప్రవర్తించి, దాడికి యత్నించడంతో పాటు ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన వార్డు సభ్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Bikkanoor Sarpanch Attack Case | అసలేం జరిగింది?

భిక్కనూరు గ్రామ సర్పంచి బాల్యాల రేఖ గురువారం (నవంబర్ 26) ఉదయం సుమారు 11 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహిస్తున్నారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన 14వ వార్డు సభ్యుడు పెద్దబచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి, సర్పంచితో అనవసరంగా వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మాటల తగవు ముదిరి అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Bikkanoor Sarpanch Attack Case | బయటకు వెళ్తుండగా అడ్డుకుని బెదిరింపులు!

సమావేశం అనంతరం సర్పంచి బాల్యాల రేఖ పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా, జ్ఞాన ప్రకాష్ రెడ్డి దారికి అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఇతరుల సమక్షంలోనే దురుసుగా ప్రవర్తిస్తూ, చంపుతానని బెదిరించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

Bikkanoor Sarpanch Attack Case | వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం!

గత కొన్ని రోజులుగా వివిధ వాట్సాప్ గ్రూపులలో తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ, తన వ్యక్తిగత గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని సర్పంచి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

సర్పంచి బాల్యాల రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు భిక్కనూరు ఎస్సై అనిల్ తెలిపారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *