Nov 27 Horoscope | బుధ, శుక్రుల కలయికతో అరుదైన యోగం.. కర్కాటకం సహా ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 27 Horoscope | చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించి, ఆరుద్ర నక్షత్రంలో సంచరించనున్నాడు. అదే సమయంలో బుధుడు, శుక్ర గ్రహాలు కలిసి ‘లక్ష్మీ నారాయణ యోగం’ ఏర్పడటం వల్ల వ్యాపార, ఆర్థిక రంగాల్లో కొన్ని రాశుల వారికి నేడు (శుక్రవారం, నవంబరు  27) మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.

Nov 27 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Nov 27 Horoscope | లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఇవాళ మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన లేదా పోయిన డబ్బు తిరిగి చేతికి అందవచ్చు. న్యాయపరమైన వ్యవహారాల్లో మీకు సానుకూలత కనిపించవచ్చు. చదువుకునే వారికి, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వృషభ రాశి: Nov 27 Horoscope | ఇవాళ మీకు సాధారణమైన లేదా మిశ్రమ ఫలితాలు ఎదురుకావచ్చు. బుధ, గురు, శుక్ర గ్రహాల స్థితి అనుకూలంగా లేకపోవడంతో ఖర్చులు, పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. పోటీదారుల పట్ల జాగ్రత్త వహించండి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రమకు తగిన ఫలితం వెంటనే కనిపించకపోవడం వల్ల కొంత నిరుత్సాహం కలగవచ్చు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

మిథున రాశి: Nov 27 Horoscope | మీకు ప్రత్యేకమైన లాభాలు, మంచి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రజాజీవితం లేదా రాజకీయాల్లో ఉన్నవారికి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు, పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి: Nov 27 Horoscope | లక్ష్మీ నారాయణ యోగం తోడుగా, ధన కారకుడైన గురువు రెండో స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. శుక్రుడు నాలుగో స్థానంలో ఉండటంతో కొత్త వాహనం కొనే ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. బుధ గ్రహం అనుకూలత వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది మంచి సమయం.

సింహ రాశి: Nov 27 Horoscope | లగ్నంలో గురువు ఉండటం కొంత బలాన్ని ఇచ్చినా, కేతువు ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పని ప్రదేశంలో పైఅధికారుల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు, కానీ తోటి ఉద్యోగులతో సమన్వయం కుదురుతుంది. ఆర్థికంగా పరిస్థితి సాధారణంగా ఉంటుంది. తొందరపడకుండా పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి.

కన్య రాశి: Nov 27 Horoscope | లక్ష్మీ నారాయణ యోగం వల్ల మీకు శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది, తల్లిదండ్రుల నుంచి తోడ్పాటు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు లేదా ప్రాజెక్టుల ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయావకాశాలు ఉన్నాయి.

తులా రాశి: వివిధ రంగాల్లో అదృష్టం తోడయ్యే రోజు ఇది. మీరు చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి, ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారంలో మరింత మెరుగైన లాభాల కోసం కాస్త ఎక్కువ కృషి చేయాల్సి రావచ్చు. మీ ఆత్మవిశ్వాసం, పని సామర్థ్యం పెరుగుతాయి. దైవచింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : ఇవాళ మీరు ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు, పనుల్లో అడ్డంకులు ఎదురుకావడం వల్ల సహనం పరీక్షకు గురవుతుంది. బుధ, గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో పాటు, ఐదో స్థానంలో శని సంచారం వల్ల ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.

ధనుస్సు రాశి : లక్ష్మీ నారాయణ యోగం ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది అనుకూల సమయం. జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయభేదాలు తగ్గే అవకాశం ఉంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది, బంధువుల ద్వారా ప్రయోజనాలు కలగవచ్చు. ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మకర రాశి : ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని పనుల్లో ఆశించిన ఫలితం రాకపోవచ్చు. పాత అప్పులు లేదా ఆర్థిక భారాలు కొంత పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు, కాబట్టి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కుటుంబ, వైవాహిక జీవితంలో విభేదాలు రాకుండా ఓపికగా వ్యవహరించండి.

కుంభ రాశి : రాహువు ప్రభావం వల్ల ఇవాళ మిశ్రమంగా ఉంటుంది. పని భారం పెరిగే అవకాశం ఉంది. వాహనం లేదా స్థలం కొనుగోలు చేసే అంశాలు, లేదంటే నివాసం మార్చే ఆలోచనలు ముందుకు సాగవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఆశించినంత లాభం వెంటనే రాకపోవచ్చు. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది.

మీన రాశి : రాశి అధిపతి అయిన గురువు ఆరో స్థానంలో, చంద్రుడు నాలుగో స్థానంలో సంచరిస్తున్నారు. పిల్లలకు సంబంధించిన విషయాలు, సమస్యలను పరిష్కరించడంలో ఎక్కువ సమయం గడపవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *