CJP Pakistan Links | సీజేపీకి పాక్​తో సంబంధాలు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

కాక్రోచ్​ జనతా పార్టీకి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CJP Pakistan Links | కాక్రోచ్​ జనతా పార్టీ (Cockroach Janata Party)కి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని, ఆ పార్టీ నాయకులకు పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ ఆరోపించారు. అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకాలకు విదేశీ ఆర్థికవేత్తలతో సంబంధం ఉందని అధికారుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల సీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. మొదట విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన సీజేపీ తర్వాత ఎస్​ఐఆర్​పై పోరాటం చేసింది. ఇటీవల పాలన మార్పు పేరిట ఆ సంస్థ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ఆరోపణలు చేయడం గమనార్హం. సీజేపీకి భారత్ వ్యతిరేక ఎన్జీఓలు, సంస్థల ద్వారా అనధికారిక వనరుల నుండి నిధులు అందుతున్నాయని చూపించడానికి తగినంత సాక్ష్యం ఉందన్నారు. అభిజీత్ దీప్కే అమెరికాకు చెందిన దాతల నుంచి నిధులు పొందుతున్నారని, అశుతోష్ రాంకాకు పాకిస్తానీ రాజకీయ నాయకులు డబ్బు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

CJP Pakistan Links | ప్రజలను రెచ్చగొట్టేలా..

పండుగ సీజన్‌లో ఢిల్లీలో గందరగోళం సృష్టించేందుకే సీజేపీ ఇటీవల నిరసనలు చేపట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ ఎ సిన్హా అన్నారు. నెల రోజులుగా సీజేపీ వ్యూహాలన్నీ తిరుగుబాటును రెచ్చగొట్టడానికే ఉద్దేశించినవి అని పేర్కొన్నారు. వారి వెనుక దురుద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. సీజేపీ, కాంగ్రెస్​ ఒకే సమయంలో న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Punjab DA Case | అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీగా ఉంటారు : సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *