Judge’s Son Car Accident | స్కూటీని ఢీకొన్న జడ్జి కుమారుడు.. ఒకరి మృతి

కేరళలో ఒక న్యాయమూర్తి కుమారుడు కారుతో బీభత్సం సృష్టించాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Judge’s Son Car Accident | కేరళ (Kerala)లో ఒక న్యాయమూర్తి కుమారుడు కారుతో బీభత్సం సృష్టించాడు. 17 ఏళ్ల బాలుడు కొచ్చిలో తన తండ్రి మెర్సిడెస్-బెంజ్ కారుతో స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి మరణించాడు.

బాలుడి తండ్రి త్రిస్సూర్‌లోని కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులకు తెలియకుండా కారు తీసుకొచ్చినట్లు బాలుడు పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో వర్షం పడటంతో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కాగా వాహనం జడ్జి పేరుపై ఉంది. దీంతో ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Judge’s Son Car Accident | స్టేషన్​ బెయిల్..

ప్రమాదం తర్వాత పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం చెరనల్లూరులోని కంటైనర్ రోడ్డులో గల మరపరంబులోని ఫోర్డ్ షోరూమ్ సమీపంలో జరిగింది. మృతి చెందిన వ్యక్తిని మంజలి ప్రాంతానికి చెందిన జయబాలకృష్ణన్​గా గుర్తించారు. కాగా బాలుడు నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. అయితే పలువురు అధికారులు, నాయకులు పిల్లలు లగ్జరీ కార్లపై రయ్యున దూసుకుపోతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

Judge’s Son Car Accident | బాధితులపై దురుసు ప్రవర్తన

నిందితుడు న్యాయమూర్తి కుమారుడు కావడంతో విచారణను ప్రభావితం చేసే యత్నాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. లైసెన్స్ లేకుండా తన 17 ఏళ్ల కుమారుడిని కారు నడపడానికి ఎందుకు అనుమతించారని తాము ప్రశ్నించినప్పుడు, పోలీస్ స్టేషన్‌లో ఆ న్యాయమూర్తి తమతో దురుసుగా ప్రవర్తించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిడికిలి బిగించి, తనను ప్రశ్నించవద్దని బెదిరిస్తున్నట్లుగా కుటుంబం వద్దకు వచ్చారని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు ఫొటోలను తన ఫోన్ నుండి తొలగించమని పోలీసులు బలవంతం చేశారని మృతుడి సోదరుడు సెల్వరాజ్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Bank Holidays November | నవంబర్‌లో బ్యాంకులు ఎనిమిది రోజులు బంద్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *