Bank Holidays November | నవంబర్‌లో బ్యాంకులు ఎనిమిది రోజులు బంద్!

తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకులు నవంబర్ నెలలో ఎనిమిది రోజులు మూసి ఉండనున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bank Holidays November | నవంబర్ నెలలో దేశంలోని బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. అయితే ఇవి దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. కొన్ని ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

ఇందులో సాధారణ సెలవులతోపాటు దీపావళి, గురునానక్ జయంతి ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు పనులకోసం బ్యాంకులకు వెళ్లేవారు ఈ సెలవులను గమనించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు మాత్రమే మూసి ఉంటాయి. నెట్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపొందించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్‌లో బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి.

Bank Holidays November | జాతీయ సెలవులు..

నవంబర్ 01 : ఆదివారం.
నవంబర్ 08 : ఆదివారం (దీపావళి).
నవంబర్ 14 : రెండో శనివారం.
నవంబర్ 15 : ఆదివారం.
నవంబర్ 22 : ఆదివారం.
నవంబర్ 24 : గురు నానక్ జయంతి సందర్భంగా దేశంలోని చాలా ప్రాంతాలలోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 28 : నాలుగవ శనివారం.
నవంబర్ 29 : ఆదివారం.

Bank Holidays November | స్థానిక సెలవులు..

నవంబర్ 09 : గోవర్ధన్ పూజ, బలి ప్రతిపద సందర్భంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్‌లలోని చాలా బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 10 : నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్‌లో సెలవు.
నవంబర్ 11 : భాయిదూజ్ సందర్భంగా యూపీ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో బ్యాంకులకు హాలీడే.
నవంబర్ 13 : వంగలా సందర్భంగా మేఘాలయలోని పలు బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 16 : ఛాత్‌పూజ సందర్భంగా బిహార్, ఝార్ఖండ్, యూపీ, ఢిల్లీలలని బ్యాంకులలో కార్యకలాపాలు జరగవు.
నవంబర్ 23 : సెంగ్ కుట్ స్నెమ్ సందర్భంగా షిల్లాంగ్ లోని బ్యాంకులకు సెలవు
నవంబర్ 27 : కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలోని బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి..: Driving License New Rules | డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు..కేంద్రం కొత్త ముసాయిదా ప్రతిపాదనలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *