Driving License New Rules | డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు..కేంద్రం కొత్త ముసాయిదా ప్రతిపాదనలు!

భారతీయులకు, విదేశీ పౌరులకు వేర్వేరు ఫార్మాట్లలో లామినేటెడ్ లేదా పీవీసీ కార్డుల రూపంలో లైసెన్సులు అందించనున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Driving License New Rules | దేశంలో రోడ్డు Road ప్రమాదాలను అరికట్టడంతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం Govt లెర్నర్స్ లైసెన్స్ (LLR) విధానంలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రతిపాదిత ముసాయిదా నియమాలను సిద్ధం చేసింది.

Driving License New Rules | లెర్నర్స్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు

ఉత్తీర్ణత మార్కుల పెంపు: డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షలో పాస్ మార్కులను 50 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.

కనీస సమయం: ట్యుటోరియల్ పూర్తి చేసేందుకు కనీసం 30 నిమిషాల వ్యవధిని కేటాయించాల్సి ఉంటుంది.

వ్యవధి పెంపు: ట్యుటోరియల్ పూర్తి చేసేందుకు గతంలో ఉన్న 7 రోజుల గడువును 15 రోజులకు పెంచనున్నారు.

మినహాయింపుల రద్దు: గతంలో ఎల్ఎల్ఆర్ పొందినవారికి లేదా డ్రైవింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇచ్చిన పరీక్ష మినహాయింపులను తొలగించనున్నారు. అందరూ కచ్చితంగా ట్యుటోరియల్, పరీక్ష రాయాల్సిందే.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Driving License New Rules | ఆధార్‌తో ఉచిత సేవలు

డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ సవరణలు లేదా మార్పుల కోసం ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ ధ్రువీకరణ ద్వారా ఉచితంగా సేవలు అందించాలని భావిస్తున్నారు. దీనివల్ల వాహనదారులపై రుసుముల భారం తగ్గుతుంది.

డాక్యుమెంట్లు: చిరునామా, వయస్సు, గుర్తింపు ఆధారాల కోసం ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఈ-రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పెన్షన్ పత్రాలను అంగీకరిస్తారు. చిరునామా ధ్రువీకరణకు 3 నెలల లోపు జారీ చేసిన కరెంట్ లేదా గ్యాస్ బిల్లు సమర్పించవచ్చు.

ఆమోద గడువు: వివరాల మార్పు కోసం చేసే ఆన్‌లైన్ దరఖాస్తులను అధికారులు 15 రోజుల్లోగా పరిశీలించి ఆమోదించడం లేదా తిరస్కరించడం (కారణంతో సహా) చేయాలి. చిరునామా మార్పు దరఖాస్తులపై 30 రోజుల్లోగా అధికారులు నిర్ణయం తీసుకోకపోతే, అది ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లు పరిగణిస్తారు.

కొత్త కార్డ్ ఫార్మాట్: భారతీయులకు, విదేశీ పౌరులకు వేర్వేరు ఫార్మాట్లలో లామినేటెడ్ లేదా పీవీసీ (PVC) కార్డుల రూపంలో లైసెన్సులు అందించనున్నారు.

Driving License New Rules | అమలు ఎప్పటి నుంచి?

ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలు మాత్రమే. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణకు 30 రోజుల సమయం ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరమే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అంతవరకు ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *