Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Kamareddy Collector Fake IDs | ఏకంగా కలెక్టర్ పేరుతోనే ఫేక్ ఐడీలు.. ఫిర్యాదు చేసిన పాలనాధికారి

సోషల్ మీడియా సైబర్ నేరగాళ్లకు వేదికగా మారింది అమాయక ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులను సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు.

shashi kiran Mottala
Last updated: October 26, 2026, 10:31 am 10:31 am
Shashi kiran Mottala
Share
Kamareddy Collector Fake IDs

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector Fake IDs | సోషల్ మీడియా సైబర్ నేరగాళ్లకు వేదికగా మారింది. ఈ వేదికగా అమాయక ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులను సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లో ఫేక్ ఐడీలతో అకౌంట్స్ క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

Kamareddy Collector Fake IDs | కామారెడ్డి కలెక్టర్ పేరిట

తాజాగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేరు మీద ఫేక్​ ఐడీలను సృష్టించారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్​లలో ఫేక్ ఐడీలు సృష్టించి వైరల్ చేస్తున్న విషయాన్ని కలెక్టర్ గ్రహించారు. నష్టం జరగకముందే స్పందించిన ఆయన వెంటనే దేవునిపల్లి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. కలెక్టర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన వారి వివరాలు గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఫేక్ ఐడీల ద్వారా కలెక్టర్ పేరు చెప్పి పలువురికి మెసేజ్​లు పెట్టి డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు అధికారుల పేర్లతో ఫేక్ ఐడీలు సృష్టించి, వారి సన్నిహితులకు, ఉద్యోగులకు మెసేజ్ లు పంపి డబ్బు వసూలు చేయడం, వ్యక్తిగత సమాచారం సేకరించడం చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. కలెక్టర్ విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉండటంతో ఆయన ముందుగానే స్పందించడం సరైన నిర్ణయమని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Kamareddy Collector Fake IDs | గతంలోను అధికారుల పేర్లతో..

సోషల్ మీడియాలో అధికారుల ఫొటోలు, పేర్లు వాడి ఫేక్ ఐడీలు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ జిల్లాలో పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పేరిట ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. సైబర్ నేరగాళ్లు మొదట అధికారి అధికారిక అకౌంట్ నుంచి ఫోటోలు, సమాచారం సేకరించి, ఆ తర్వాత ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, వారి పరిచయస్తులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతారు. కొందరు అమాయక ప్రజలు అదే అధికారి అకౌంట్ అని నమ్మి మెసేజ్​లకు స్పందిస్తారు. ఆ తర్వాత డబ్బు అడగడం, ఓటీపీలు అడగడం, లింకులు పంపడం ద్వారా మోసానికి పాల్పడుతారు. ఈ విషయంలో కలెక్టర్ ముందస్తుగా ఫిర్యాదు చేయడంతో పెద్ద నష్టం జరగకుండా ఆగిపోయిందని చెప్పవచ్చు. కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Perini Natyam | పేరిణి నృత్య ఘట్టం..ఉత్సాహంగా నాట్య పరీక్షలు!

TAGGED:ashish sangwancyber crime TelanganaFake Social Media AccountsInstagram Fake AccountKamareddy Collectorkamareddy newsTelangana NewsWhatsApp Fake ID
shashi kiran Mottala
ByShashi kiran Mottala
Follow:
తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Judge's Son Car Accident Judge’s Son Car Accident | స్కూటీని ఢీకొన్న జడ్జి కుమారుడు.. ఒకరి మృతి
Next Article CM House Protest Arrests CM House Protest Arrests | సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్న ఉద్యమకారుల అరెస్ట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Municipal Workers Strike
నిజామాబాద్

Municipal Workers Strike | మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..: అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

By Shashi kiran Mottala
Telangana Student Missing
తెలంగాణ

Telangana Student Missing | ఫిన్లాండ్​లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

By Srinivas Kolluri
Shamirpet Tahsildar Bribe
హైదరాబాద్తెలంగాణ

Shamirpet Tahsildar Bribe | రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్

By Balla Sandeep Kumar
Indalwai Toll Gate
నిజామాబాద్

Indalwai Toll Gate | వాహనదారులూ జాగ్రత్త.. ఇందల్​వాయి టోల్​గేట్ వద్ద రూ.300 ‘ఫాస్టాగ్’ దోపిడీ!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.