అక్షరటుడే, బాన్సువాడ: CM House Protest Arrests | పట్టణంలో పలువురు ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేశారు.
CM House Protest Arrests | హామీలను అమలు చేయాలని..
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమ కారులు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25వేల పెన్షన్‌తో పాటు గుర్తింపు కార్డులు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యమకారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేయకపోవడంతో నిరసనగా సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుత గంగాధర్, గంజి చందు, భాస్కర్ గౌడ్, కల్వ శ్యామ్, ఎదుబల్లి కృష్ణ, దత్తు, గంగారాం, పళ్లికొండ సాయిలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Collector Fake IDs | ఏకంగా కలెక్టర్ పేరుతోనే ఫేక్ ఐడీలు.. ఫిర్యాదు చేసిన పాలనాధికారి