Kodad Gas Explosion | కోదాడలో గ్యాస్ సిలిండర్ పేలుడు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodad Gas Explosion | సూర్యాపేట (Suryapet) జిల్లా కోదాడ పట్టణంలో గ్యాస్​ సిలిండర్​ పేలుడు కలకలం సృష్టించింది. రంగ థియేటర్ పక్కన ఉన్న వీధిలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది.

ఎల్​పీజీ (LPG) సిలిండర్లను రీఫిల్ చేసే దుకాణం నుంచి పేలుడు సంభవించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేలుడు సమయంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుకాణాల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

Kodad Gas Explosion | అక్రమంగా రీఫిల్లింగ్​

gas

రాష్ట్రంలో కొందరు గ్యాస్​ సిలిండర్ల రీఫిల్లింగ్​ దందా చేస్తున్నారు. డొమెస్టిక్​ సిలిండర్లను అక్రమంగా ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండే వలస జీవులు చిన్న గ్యాస్​ సిలిండర్లను బయట నింపించుకుంటున్నారు. చిన్న దుకాణాలు పెట్టుకొని కొందరు సిలిండర్ల నుంచి గ్యాస్​ను అందులో నింపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ గ్యాస్​ రీఫిల్లింగ్​పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

దీనిని కూడా చదవండి : Kamareddy Theft | పెళ్లి వేడుకలో బంగారం చోరీ.. సాంకేతిక ఆధారాలతో దొంగను పట్టుకున్న పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *