అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rainfall Update | రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేటి నుంచి తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాలతో పాటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ముసురు పెట్టింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే నేటి చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయి. అయితే గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Telangana Rainfall Update | ఆ జిల్లాల్లో..
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ (Medak), సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో చెదురుమొదురు జల్లులు పడుతాయి. హైదరాబాద్ (Hyderabad Weather) నగరంలో వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని చోట్ల స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana Rainfall Update | జోరుగా వ్యవసాయ పనులు
వానాకాలం సీజన్ ప్రారంభం అయిన తర్వాత తొలిసారి భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇన్ని రోజులు నీరు లేక వరినాట్లు వేయడానికి ఆలోచించిన రైతులు ఈ వానలతో పనులు ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరి నాట్లు కొనసాగుతున్నాయి. అలాగే ఇప్పటికే వేసినన నాట్లు, ఇతర పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేశాయని రైతులు పేర్కొంటున్నారు.
దీనిని కూడా చదవండి : Food Adulteration Action | ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎస్ సంజయ్ జాజు