అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka Statement | దావోస్ నగరంఆర్థిక వ్యవహారాలకు కేంద్రంగా ఉన్నట్లు హైదరాబాద్ (Hyderabad) సమాజాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామాజిక, రాజకీయ, ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలపై చర్చలకు వేదికగా మారాలని అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
భారత్ సమ్మిట్‌పై నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సమాజాల అనుభవాలను ఉదహరిస్తూ, ద్వేషపూరిత, విభజన రాజకీయాలు ఏమాత్రం సరైన మార్గం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ప్రజాస్వామ్యంలోనూ ప్రతిపక్షాలు అంతర్భాగమని, అధికారంలో ఉన్నవారు వాటిని శత్రువులుగా చూడకూడదని ఆయన నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను నిర్మూలించడానికి లేదా వారి గొంతు నొక్కడానికి చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు అన్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కనిపిస్తున్న ఇటువంటి ధోరణులు సరికాదన్నారు.
ఇది కూడా చదవండి..: ACB Trap | బిల్లుల కోసం రూ.50 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్