అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | ముడి చమురు ధరలు తగ్గుతుండడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడంతో భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ పరుగులు తీస్తోంది. దీంతో పదిరోజుల్లోనే ప్రధాన సూచీలు పది శాతానికిపైగా పెరిగాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఎనిమిది నెలల గరిష్టానికి చేరాయి. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఫార్మా, హెల్త్‌కేర్, రియల్టీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.
Stock Market Rally | భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,142 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 279 పాయింట్ల దిద్దుబాటుకు గురయ్యింది. అక్కడినుంచి పుంజుకుని 551 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 293 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 74 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 161 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,243 పాయింట్ల లాభంతో 82,349 వద్ద, నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో 25,374 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 26 స్టాక్స్ లాభాలతో, 4 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఇండిగో 4.81 శాతం, ఎం అండ్ ఎం 4.38 శాతం, ట్రెంట్ 3.64 శాతం, పవర్‌గ్రిడ్ 3.06 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.99 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : సన్‌ఫార్మా 0.21 శాతం, టీసీఎస్ 0.17 శాతం, టైటాన్ 0.04 శాతం, ఇన్ఫోసిస్ 0.03 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Nov 11 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ