అక్షరటుడే వెబ్‌డెస్క్: Paramotor Digital IPO | డిజిటల్ ఫైనాన్స్ , హెల్త్‌కేర్ రంగాలకు చెందిన రెండు ప్రముఖ సంస్థలు పబ్లిక్ ఇష్యూ (IPO)కి సిద్ధమవుతున్నాయి. ఫిన్‌టెక్ రంగానికి చెందిన పారామోటార్ డిజిటల్ టెక్నాలజీస్ సెబీకి దరఖాస్తు చేయగా, పారస్ హెల్త్‌కేర్ తన ఐపీఓ షెడ్యూల్ , ప్రైస్ బ్యాండ్‌ను అధికారికంగా ప్రకటించింది.
Paramotor Digital IPO | నిధుల సేకరణ..
డిజిటల్ గిఫ్టింగ్, రివార్డ్స్, కన్స్యూమర్ స్పెండ్ మేనేజ్మెంట్ రంగాల్లో సేవలు అందిస్తున్న పారామోటార్ డిజిటల్ టెక్నాలజీ లిమిటెడ్ రూ.1,000 కోట్ల ఐపీఓ కోసం సెబీ (SEBI)కి అప్డేటెడ్ డ్రాఫ్ట్ పత్రాలను (UDRHP-I) సమర్పించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఈ ఇష్యూలో రూ.698 కోట్ల విలువైన కొత్త షేర్లు (ఫ్రెష్ ఇష్యూ), రూ.302 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ప్రమోటర్లు సోనియా పంకజ్ ఆషర్, రాహుల్ ఆనంద్ తలా రూ.151 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. కంపెనీ రూ.139.60 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
నిధుల వినియోగ ప్రణాళిక..
ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే రూ.698 కోట్లలో కస్టమర్ల సేకరణ, బ్రాండ్ , బిజినెస్ ప్రమోషన్ల కోసం రూ.355 కోట్లు, టెక్నాలజీ అభివృద్ధి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు, ఐటీ అసెట్స్ కోసం రూ.94 కోట్లు వెచ్చిస్తారు. అలాగే ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల కోసం రూ.38 కోట్లు కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
Paramotor Digital IPO | సేవల వివరాలు..
2016లో ఏర్పాటైన ఈ సంస్థ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs), డిజిటల్ గిఫ్టింగ్, రివార్డ్స్ & లాయల్టీ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సేవలను అందిస్తోంది. ప్రీపెయిడ్ కార్డ్ యూజర్ల కోసం ‘స్పెండ్ప్రో’, గిఫ్ట్ కార్డ్‌లు & రివార్డ్ పాయింట్ల మార్కెట్‌ప్లేస్ ‘యాహ్.షాప్’, కార్పొరేట్ల కోసం ‘రివార్డ్ఆన్’, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ సేవలందించే ‘డెవ్స్టాక్’ ప్లాట్‌ఫామ్‌లను నడుపుతోంది. బ్యాంకులు, ఆర్బీఐ లైసెన్స్ పొందిన సంస్థల తరఫున పీపీఐ ప్రోగ్రామ్ మేనేజర్‌గా, డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తోంది.
వినియోగదారుల వివరాలు..
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం ఆర్థిక సంవత్సరం 2024లోని రూ.33.08 కోట్ల నుంచి FY25లో రూ.112.08 కోట్లకు, అలాగే FY26 నాటికి ఏకంగా రూ.603.15 కోట్లకు పెరిగింది. నికర లాభం FY24లో రూ.4.94 కోట్ల నుంచి FY25లో రూ.24.51 కోట్లకు, FY26 నాటికి రూ.59.14 కోట్లకు చేరింది. జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికంలో రూ.252.77 కోట్ల ఆదాయం, రూ.23.81 కోట్ల నికర లాభం సాధించింది. FY26లో కంపెనీకి 1.58 మిలియన్ల ట్రాన్సాక్టింగ్ యూజర్లు ఉండగా, యూజర్ రిటెన్షన్ రేటు 99%గా నమోదైంది. ఈ ఇష్యూకి మోతీలాల్ ఓస్వాల్, ఎక్విరస్ క్యాపిటల్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
Paramotor Digital IPO | ప్రైస్ బ్యాండ్ వివరాలు..
ప్రముఖ ఆసుపత్రుల నెట్వర్క్ అయిన పారస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ తన పబ్లిక్ ఇష్యూను అక్టోబర్ 21, 2026న ప్రారంభించి అక్టోబర్ 23, 2026న ముగించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 19న జరుగుతుంది. షేరు ముఖ విలువ రూ.1 కాగా, ఐపీఓ ధరల శ్రేణిని రూ.660 నుండి రూ.693గా నిర్ణయించారు. నిపుణులు , ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్లు (ఒక లాట్) , ఆ తర్వాత అవే గుణిమాల్లో బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
పారస్ హెల్త్‌కేర్ ఇష్యూ పరిమాణం ..
మొత్తం ఇష్యూ పరిమాణం రూ.1,450 కోట్లుగా ఉంది. ఇందులో రూ.500 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ (ఫ్రెష్ ఇష్యూ), రూ.950 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ఈ షేర్లను బిఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేస్తారు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీకి ఉన్న పాత రుణాల చెల్లింపునకు, అలాగే శ్రీనగర్‌లో ఆసుపత్రిని నిర్వహిస్తున్న అనుబంధ సంస్థ ‘ప్లస్ మెడికేర్ హాస్పిటల్స్’ అప్పులను తీర్చడానికి , ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.
Paramotor Digital IPO | కేటాయింపు నిబంధనలు..
ఈ ఇష్యూకి జెఎం ఫెైనాన్షియల్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, నువామా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఇష్యూలో కనీసం 75% వాటాను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs), గరిష్టంగా 15% నాన్-ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్లకు (NIBs), , గరిష్టంగా 10% రిటైల్ ఇన్వెస్టర్లకు (RIBs) కేటాయించారు. రీటైల్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అందరూ తప్పనిసరిగా ASBA , UPI విధానాల ద్వారానే బిడ్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ACB Trap | 22-ఏ భూమి కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్