Agricultural Officer Bribery | రూ.20 వేల లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ అధికారి

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, మెదక్​ : Agricultural Officer Bribery | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) సదాశివపేట మండల వ్యవసాయ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఓ ఎరువుల దుకాణం యజమాని నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా.. అధికారులు ఆయనను వల పన్ని పట్టుకున్నారు.

సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ ఓ వ్యక్తి నడుపుతున్న ఎరువుల వ్యాపారం సజావుగా, ఇబ్బందులు లేకుండా సాగడానికి లంచం డిమాండ్​ చేశాడు. తనకు డబ్బులు ఇస్తే వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తానని చెప్పాడు. దీంతో దుకాణ యజమాని మామ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Agricultural Officer Bribery | రూ.30 వేల డిమాండ్​

ఏవో బాధితుడి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్​ చేశాడు. అందులో రూ.10 వేలు అక్టోబర్​ 19న తీసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఏవో రమేశ్​ ఫిర్యాదుదారుడి నుంచి మరో రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: MLA Rajagopal Reddy | నిధుల కేటాయింపులో వివక్ష.. మంత్రి ఉత్తమ్​పై రాజగోపాల్​రెడ్డి ఫైర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *