అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Model School Jobs | జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ విధానంలో ఆయా పోస్టుల భర్తీకి జిలా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించింది.
Model School Jobs | నాలుగు రకాల పోస్టులకు దరఖాస్తులు..
జిల్లా (Nizamabad)లోని 10 తెలంగాణ మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సిగ్ విధానంలో నాలుగు రకాల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మోడల్ స్కూల్లో ఒక్కో ఆర్ట్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో రూ.22,750 సాలరీ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సంబంధిత మోడల్ స్కూళ్లలో ప్రినిపాళ్లను సంప్రదించాలని డీఈవో సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ లోపు సంబంధిత మోడల్ స్కూళ్లలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి ఏడురోజుల జైలు..