అక్షరటుడే, వెబ్డెస్క్: Vijayasai Reddy New Party | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో మరో పార్టీ ఏర్పాటు అయింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పేరును ప్రకటించారు. కొత్త తరం.. కొత్త ఆంధ్ర నినాదంలో పరివర్తన రాజనీతి పార్టీ (PRP)ని ఆయన బుధవారం ఉదయం ప్రకటించారు.
వైసీపీలో కీలకంగా పని చేసిన విజయ సాయిరెడ్డి అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్కు సన్నిహితుడిగా కొనసాగిన ఆయన 2024 ఎన్నికల ఓటమి అనంతరం పార్టీని వీడారు. అనంతరం తాను కొత్త పార్టీ, మీడియా చానెల్ పెడుతానని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించారు.
Vijayasai Reddy New Party | దేశం కోసం.. ధర్మం కోసం..
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ పేరును విజయ సాయిరెడ్డి ప్రకటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, ఆరెంజ్ రంగులతో పార్టీ జెండా రూపకల్పన చేశారు. జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం ఆయన పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా “దేశం కోసం ధర్మం కోసం” నినాదంతో సభా వేదిక ఏర్పాటు చేయడం గమనార్హం. ఆర్ఎస్ఎస్, బీజేపీ తరచూ దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని వినియోగిస్తాయి. తాజాగా సాయిరెడ్డి తన సభ వేదికకు ఆ పేరు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి..: APPSC Group 2 Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల!