APPSC Group 2 Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల!

తొలుత ప్రకటించిన పోస్టుల సంఖ్య కంటే అదనంగా ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: APPSC Group 2 Notification | ఆంధ్రప్రదేశ్‌ Andhra pradesh లోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. తొలుత ప్రకటించిన పోస్టుల సంఖ్య కంటే అదనంగా ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

APPSC Group 2 Notification | 686 నుంచి 720కి పెరిగిన పోస్టులు

గతంలో 686 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, వివిధ శాఖల నుంచి లభించిన అదనపు ఖాళీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని పోస్టుల సంఖ్యను 720కి పెంచుతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

పోస్టుల వివరాలు: మొత్తం 720 ఖాళీలను ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీలుగా విభజించారు..

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 471
  • నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 249
  • కీలకమైన ప్రధాన ఖాళీలు
  • డిప్యూటీ తహసీల్దార్: 203 పోస్టులు
  • డిప్యూటీ ఎంపీడీవో: 176 పోస్టులు
  • జీఎస్టీ ఆఫీసర్ (ACTO): 40 పోస్టులు
  • ఎక్సైజ్ ఎస్ఐ: 29 పోస్టులు

APPSC Group 2 Notification | ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (psc.ap.gov.in) ద్వారా OTPR (One Time Profile Registration) పూర్తి చేసి అప్లై చేసుకోవాలని కమిషన్ సూచించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకమైన కొలువులకు మార్గం సుగుమం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపరేషన్‌ను ముమ్మరం చేశారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *