Delhi Farmers Protest | ఢిల్లీలో రైతుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌ దగ్గర రైతుల నిరసన తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Farmers Protest | ఢిల్లీ (Delhi)లోని కిసాన్‌ ఘాట్‌ దగ్గర రైతుల నిరసన తెలిపారు. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు.కిసాన్​ ఘాట్​లో రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

Delhi Farmers Protest | సరిహద్దు మూసివేత

దేశ్ బచావో మార్చ్​లో భాగంగా రైతులు ఢిల్లీ వైపు కదులుతుండడంతో హర్యానా పోలీసులు శంభు సరిహద్దును మూసివేశారు. కీలక మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, పలువురు రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఆందోళనను తలపించేలా పంజాబ్-హర్యానా సరిహద్దులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ఆందోళనలో రైతులను జాతీయ రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప మేకులు, బహుళ అంచెల బారికేడ్లతో సరిహద్దును ఒక కోటగా మార్చారు.

Delhi Farmers Protest | దేశ్​ బచావో మోర్చా ఆధ్వర్యంలో..

ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన రైతు సంఘాలు ఢిల్లీకి తరలివచ్చాయి. అయితే పలువురిని ఢిల్లీకి రాకముందే పోలీసులు అడ్డుకున్నారు. అయినా కొంతమంది రైతులు ఢిల్లీకి చేరుకొని కిసాన్​ ఘాట్​లో ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Delhi Farmers Protest | రైతులపై ప్రభావం

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, ఇథనాల్, ఆపిల్స్, బాదం, పాల ఉత్పత్తులు, కోళ్లు మరియు మత్స్య పరిశ్రమ వంటి ఉత్పత్తులపై తక్కువ సుంకాలు, తక్కువ పరిమితుల ద్వారా భారతదేశ వ్యవసాయ, పాడి మార్కెట్లలోకి మరింత లోతైన ప్రవేశం కల్పించాలని గత అమెరికా వాణిజ్య నివేదికలు నిరంతరం కోరాయని రైతు నాయకులు తెలిపారు. దీంతో దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: NEET Paper Leak | నీట్ అక్రమాలు.. దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం: ప్రధాని మోదీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *