ram sugar rani rajput | ఏడు పదుల ప్రేమామృతం.. రీల్స్ మహిమో, ఆస్తుల మహత్యమో!

ఒకరి వేలికి ఒకరు మోజుపడి రింగులు తొడిగేసుకున్నారు! ఇక నవరాత్రుల శుభ ముహూర్తం చూసుకుని పెళ్లి పీటలు ఎక్కడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: ram sugar rani rajput | వయసు డెబ్బై ఐదు.. మనసు ముప్పై! పండు ముసలాడికి పాతికేళ్ల చిన్నదానిపై మనసైతే.. కుర్రకారుకు కన్ను కుట్టక ఏమవుతుంది? ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ “అజబ్ ప్రేమ్ గజబ్ కహానీ” ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీకి, కామెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

ram sugar rani rajput | రీల్స్ రచ్చ.. లవ్ టచ్

ప్రేమ గుడ్డిది అంటారు కానీ.. ఇక్కడ మరీ ఇంపాజిబుల్ ఫీట్లను పాజిబుల్ చేసేంత విజన్ కలిగి ఉందంటే ఆశ్చర్యమేస్తోంది! యూపీ UP లోని ఔరయ్యా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రాంసుగర్ తాత గారికి, 30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ అనే ఇన్​స్టాగ్రామ్ రీల్స్ భామకు మధ్య ఏకంగా 45 ఏళ్ల గ్యాప్‌లో ప్రేమ పువ్వు వికసించిందట!

Karnataka Dry Day | రూ.500 కోట్ల నష్టం వస్తుందంటూ ఆందోళన..డ్రై డే ఆంక్షలు ఎత్తేయాలని హోటళ్ల సంఘం విజ్ఞప్తి!

తాతగారి కూతురిని కలవడానికి, వీడియోలు షూట్ చేసుకోవడానికి తరచూ ఆ ఇంటికి వచ్చేదంట ఈ రీల్స్ రాణి రాజ్‌పుత్. అయితే ఫ్రెండ్‌తో కన్నా.. ఫ్రెండ్ వాళ్ల నాన్నగారి మనసే ఈమెకు బాగా నచ్చేసిందట!

ram sugar rani rajput తాతగారి రొమాంటిక్ ట్రాక్

ఈ తాతగారి సతీమణి ఏడేళ్ల క్రితం కాలం చేసిందట.. ఇక అప్పటి నుంచి ఒంటరిగా గుండెల్లో దాచుకున్న ప్రేమను అలా దాచి దాచి, చివరికి కూతురి ఫ్రెండ్ ముందు పరిచాడట. మాటలు కలిసి, మనసులు కలిసి.. చివరికి వృద్ధాప్యపు రొమాంటిక్ లవ్ స్టోరీ గడప దాటిందట!

ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం వేడుకగా, గ్రాండ్‌గా జరిగిపోయిందట. ఒకరి వేలికి ఒకరు మోజుపడి రింగులు తొడిగేసుకున్నారు! ఇక నవరాత్రుల శుభ ముహూర్తం చూసుకుని పెళ్లి పీటలు ఎక్కడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు.

ram sugar rani rajput | సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం

డెబ్బై ఐదు ఏళ్ల వయసులో ఈ పెళ్లి గోల ఏంటి తాతా అని నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే.. “వయసు కేవలం అంకె మాత్రమే.. ప్రేమే ముఖ్యం” అంటూ కొత్తగా తత్వాన్ని బోధిస్తున్నారు ఈ జంట.

ముసలాయన ప్రేమలోని తీపిని చూసి పడిపోయిందో.. లేక ఆయన వెనుకున్న ఆస్తిపాస్తుల ఘాటు చూసి ఫ్లాట్ అయిందో కానీ, నెటిజన్లు మాత్రం ఈ ప్రేమకథపై ఘాటైన వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

ram sugar rani rajput | యువతకు శోకం.. తాతలకు లోకం!

పాతికేళ్లు దాటినా పెళ్లిళ్లు కాక ఉద్యోగాల వేటలో, పిల్లను ఇచ్చే వారి కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్న నయా యువతకు ఈ వార్త కోలుకోలేని దెబ్బే! “మాకు కనీసం పిల్లను ఇచ్చే దిక్కు లేదు కానీ.. డెబ్బై ఐదేళ్ల తాతకు మాత్రం క్రేజీ రీల్స్ పాప దొరికింది” అంటూ బ్యాచిలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా, వయసుతో సంబంధం లేకుండా రూపుదిద్దుకున్న ఈ విచిత్రమైన ప్రేమాయణం.. ఇప్పుడు యూపీ వీధుల్లో, సోషల్ మీడియా రీల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది!

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *