TVK Vijay | విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. ఆ పార్టీల మద్దతు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVK Vijay | తమిళనాడు (Tamil Nadu)లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెర పడింది. మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్​కు తెర పడింది. టీవీకే అధినేత విజయ్​ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్​ క్లియర్​ అయింది.

టీవీకేకు సీపీఐ (CPI), సీపీఎం (CPM), వీసీకే మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్​ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 చోట్ల విజయం సాధించింది. మ్యాజిక్​ ఫిగర్​ 118కి పది సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్​ ఆ పార్టీని ఆహ్వానించలేదు. ముందే సంఖ్యాబలం చూపాలని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా వామపక్ష పార్టీలు తాజాగా చర్చలు జరిపి టీవీకేకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చాయి.

TVK Vijay | బలాలు ఇలా..

ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. అందులో విజయ్​ ఒక స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 107కు చేరింది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్​ దళపతికి జై కొట్టింది. తాజాగా సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 మద్దతు ఇచ్చాయి. దీంతో టీవీకే బలం 118కి చేరింది. మ్యాజిక్​ ఫిగర్​ దక్కడంతో విజయ్​ సీఎం (CM Vijay)గా ప్రమాణం చేయనున్నారు.

TVK Vijay | గవర్నర్​ను కలవనున్న విజయ్

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు సమకూరడంతో టీవీకే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ మేరకు విజయ్​ మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్​తో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్​ను కలిశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. తాజాగా ఆయా పార్టీలు మద్దతు తెలపడంతో గవర్నర్​ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్​ను ఆహ్వానించున్నారు. టీవీకే ఎమ్మెల్యే, విజయ్​ కీలక సహాయకుడు ఆధవ్ అర్జున్ ఇప్పటికే పాటినపాక్కంలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు.

దీనిని కూడా చదవండి : TARA Weapon Test | డీఆర్​డీవో కీలక అడుగు.. తారా వెపన్​ టెస్ట్​ సక్సెస్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *