Milky Mist IPO | ఐపీవోకు ఫుడ్ డెయిరీ ప్రొడక్ట్స్ కంపెనీ.. రేపటినుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

స్టాక్ మార్కెట్‌లో ఐపీవోలు వరుస కడుతున్నాయి. తాజాగా ఫుడ్ డెయిరీ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ అయిన మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ వస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Milky Mist IPO | మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ కంపెనీని 2014 లో ఏర్పాటు చేశారు. ఇది దేశంలో ప్రముఖ పాల, ఘనీభవించిన ఆహార ఉత్పత్తుల కంపెనీలలో ఒకటి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 22 జిల్లాలలో ఉన్న 67,615 మంది రైతుల నుంచి నేరుగా పాలను సేకరిస్తుంది. మిల్కీ మిస్ట్, స్మార్ట్ చెఫ్, కాపెల్లా, మిస్టీ లైట్, బ్రియాస్, అసల్ తదితర బ్రాండ్స్ పేరుతో చీజ్, పనీర్, బట్టర్, నెయ్యి, పెరుగు, యోగర్ట్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తయారు చేసి విక్రయిస్తుంటుంది.

Milky Mist IPO | రూ. 1,553 కోట్లు..

మార్కెట్ నుంచి రూ. 1,553 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ ఐపీవో (IPO)కు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 10,20,14,623 షేర్లను అమ్మడం ద్వారా రూ. 1,428 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 89,28,570 షేర్లు విక్రయించి రూ. 125 కోట్లు సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు, కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, వీసీ కూలర్స్, చాకోలెట్ కూలర్స్, ఐస్‌క్రీమ్ కూలర్స్ కొనుగోలు చేయడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది.

Milky Mist IPO | ప్రైస్ బ్యాండ్ ..

కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 133 నుంచి రూ. 140 గా నిర్ణయించింది. ఒక లాట్ లో 107 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,980 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Milky Mist IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకి 15 శాతం వాటాను కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 26 గా ఉంది. ఐపీవో అలాట్ అయిన వారికి లిస్టింగ్ డే రోజున సుమారు 18 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఐపీవో బిడ్డింగ్ ఆగస్టు 11న ప్రారంభమైంది. 13వ తేదీతో సబ్‌స్క్రిప్షన్ గడువు ముగుస్తుంది. కంపెనీ షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ ఈనెల 14వ తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 18న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Paytm Share Price | ఎండీఆర్ చార్జీల జోష్.. పరుగులు తీసిన పేటీఎం షేర్లు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *