Peddi Sudarshan Reddy | నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం: కేటీఆర్

ప్రజల కోసం, తెలంగాణ కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Peddi Sudarshan Reddy | ప్రజల కోసం, తెలంగాణ కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆయన అంతిమయాత్రకు లక్ష మందికిపైగా ప్రజలు తరలివచ్చారని, సుమారు 12 గంటల పాటు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. ఇది ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు.

Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు నాయకత్వం వహించి విద్యార్థులను ముందుకు నడిపించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి ఉద్యమ పిలుపునకు ముందుండి పనిచేశారని, ఆకలి, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కార్యక్రమాలను విజయవంతం చేశారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి భవిష్యత్‌ తరాలకు గుర్తుండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే నర్సంపేట మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు.

Peddi Sudarshan Reddy | నిజమైన ఉద్యమకారుడు..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు, ప్రాణం, ఆస్తులు ఏవీ లెక్కచేయకుండా పోరాడిన అసలుసిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నల్లబెల్లిలో జరిగిన సంతాపసభలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. పెద్ది కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ, నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: JPSC Recruitment Scam | ఉద్యోగ నియామకాల కుంభకోణం.. జార్ఖండ్‌లో మాజీ చైర్మన్ అరెస్టు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *