Trainee IPS Harassment | ట్రైనీ ఐపీఎస్​కు లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్​లోని జాతీయ పోలీస్​ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trainee IPS Harassment | హైదరాబాద్​ (Hyderabad)లోని జాతీయ పోలీస్​ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీ (National Police Academy)లో ట్రైనీ ఐపీఎస్​ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్​ ఫిర్యాదు చేశారు. తనకు ఆయన అసభ్యకర మెసెజ్​లు పంపుతున్నాడని తెలిపారు. ఈ మేరకు అత్తాపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఐపీఎస్​ ట్రైనింగ్​ అధికారి వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగంలో చేరి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. శిక్షణ సమయంలో తోటి ఉద్యోగిని వేధించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విచారణ అనంతరం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : Sridhar Babu | ఎల్‌నినో ముప్పు.. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *