అక్షరటుడే, వెబ్‌డెస్క్: Durgam Cheruvu | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలోని విశాఖపట్నంకు చెందిన రాజేశ్ (25) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నాచారంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్తున్నాడు. అయితే మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అతడి స్నేహితులు ఉంటున్నారు. వారిని కలిసేందుకు రాజేశ్ సోమవారం వచ్చాడు.
Durgam Cheruvu | కేబుల్ బ్రిడ్జి సందర్శనకు వెళ్లి..
ఉదయం తన స్నేహితులతో కలిసి దుర్గం చెరువు దగ్గరకు రాజేశ్ వెళ్లాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో స్నేహితులతో గొడవ జరిగినట్లు సమాచారం. అనంతరం అతడు కనిపించకుండా పోయాడు. అతడు దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Loud Sounds | హైదరాబాద్‌లో భారీ శబ్దాలు