Labour Cards Registration | ఇటుకబట్టీ కార్మికులకు లేబర్​ కార్డులు అందించాలి: సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Labour Cards Registration | ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు (brick workers) లేబర్​ కార్డుల(labour cards) కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని అనంతరం వారికి కార్డులు అందజేయాలని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub Collector Vikas Mahato) అన్నారు. ఈ మేరకు శనివారం ఎడపల్లి(Yedapally) తహసీల్దార్‌తో కలిసి ఎడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలోని ఇటుక బట్టీల ప్రాంతాలను సందర్శించారు.

Labour Cards Registration | కార్మికుల స్థితిగతులపై ఆరా..

సబ్​ కలెక్టర్​ కార్మికులతో మాట్లాడారు. లేబర్ కార్డుల కోసం వారి రిజిస్ట్రేషన్ స్థితి గురించి ఆరా తీశారు. చాలామంది కార్మికులు అప్పటికే రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన కార్మికుల వివరాలు సేకరించాలని తప్పనిసరిగా వారికి రిజిస్ట్రేషన్​ చేయించాలని ఎడపల్లి తహశీల్దార్​కు సూచించారు. ఏఎన్ఎంల ద్వారా ఇటుక బట్టీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

coll 1

ఇది కూడా చదవండి: Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *