Ngidi Injury | ఐపీఎల్​లో విషాదం.. ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ngidi Injury | ఐపీఎల్ (IPL)​లో విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ, పంజాబ్‌ (DC vs PBKS) మ్యాచ్‌లో బౌలర్‌ ఎంగిడికి తీవ్ర గాయం అయింది.

ప్రభ్‌ సిమ్రాన్‌ కొట్టిన బంతిని క్యాచ్‌ పట్టబోయి ఢిల్లీ ప్లేయర్‌ ఎంగిడి కిందపడ్డాడు. బాడీవెయిట్‌ మొత్తం మెడ మీద పడటంతో తీవ్రంగా గాయమైంది. దీంతో మైదానంలోకి అంబులెన్స్​ వచ్చింది. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎంగిడి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Ngidi Injury | ఫీల్డింగ్​ చేస్తుండగా..

ఫీల్డింగ్ చేస్తుండగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్ మైదానంలోకి ప్రవేశించగా ఆ ఆటగాడిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్​ చేసిన ఢిల్లీ భారీ స్కోర్​ చేసింది. కేఎల్ రాహుల్ అద్భుతమైన 152 నాటౌట్ పరుగులు చేయడంతో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. రాహుల్ 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేశాడు. నితీష్ రాణా 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ చేసిన 152 పరుగుల ఇన్నింగ్స్, ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు.

ipl 1

Ngidi Injury | లక్ష్య చేధనలో దూకుడు

పంజాబ్​ 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్​కు 6.4 ఓవర్లలో 126 పరుగులు చేశారు. ఈ క్రమంలో అక్షర్​ పటేల్ (Axar Patel) బౌలింగ్​లో ప్రభ్‌ సిమ్రాన్‌ సింగ్​ బంతిని గాల్లోకి లేపాడు. దానిని క్యాచ్​ పట్టుకునే సమయంలో లుంగి ఎంగిడి వెనక్కి పరుగెడుతూ కింద పడిపోయాడు. అనంతరం అతడు లేవలేకపోవడంతో మైదానంలోకి అంబులెన్స్​ వచ్చింది. ప్రస్తుతం ఎంగిడిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దీనిని కూడా చదవండి : Kl Rahul | రాహుల్ రాకెట్ ఇన్నింగ్స్ .. 152 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త మైలురాయి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *