TRS party | ఈసీ రూల్స్‌కు కవిత ‘రివర్స్’ స్కెచ్.. ‘TRS’ బ్రాండ్ కోసం చివరన ఆ చిన్న అక్షరం!

Balla Sandeep Kumar

అక్షరటుడే, హైదరాబాద్: TRS party | మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ పేరు కేవలం సెంటిమెంట్ కోసమే కాదు.. ఎన్నికల సంఘం (EC) నిబంధనల నుంచి తెలివిగా తప్పించుకోవడానికి వేసిన ఒక ‘టెక్నికల్’ ఎత్తుగడ అని స్పష్టమవుతోంది.

TRS party | కనిపించని ‘A’.. వినిపించే ‘TRS’..

కవిత విడుదల చేసిన పోస్టర్లను నిశితంగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. పెద్ద అక్షరాలతో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని ఇంగ్లీష్‌లో Telangana Rashtra Sena అని ప్రముఖంగా కనిపిస్తున్నప్పటికీ, దాని కింద అత్యంత చిన్న అక్షరాలతో ‘Association’ అని ముద్రించి ఉంది. అంటే సాంకేతికంగా ఈ పార్టీ పూర్తి పేరు Telangana Rashtra Sena Association (TRSA).

TRS party | ఎందుకీ రహస్యం?

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ పూర్తి పేరును ప్రచారంలో ఉంచాలని చూస్తుంది. కానీ కవిత ‘అసోసియేషన్’ (A) అనే పదాన్ని దాదాపు కనిపించకుండా జాగ్రత్త పడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

ఈసీ కఠిన నిబంధనలు..

కొత్త పార్టీల పేర్ల నమోదుపై ఎన్నికల సంఘం 2014లోనే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే అనుమతించబోమని స్పష్టం చేసింది. పాత పార్టీల ప్రజాదరణను కొత్తవారు వాడుకోకుండా చూడటమే ఈ నిబంధన ఉద్దేశం.

TRS party

బ్రాండ్ ఇమేజ్ కోసం..

కేసీఆర్ స్థాపించిన పాత ‘TRS’ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇప్పుడు ‘BRS’గా మారింది. అయితే ప్రజల్లో ‘TRS’ పేరుకున్న సెంటిమెంట్ ఇంకా తగ్గలేదు. ఆ బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి సొంతం చేసుకోవడమే కవిత లక్ష్యం.

టెక్నికల్ సేఫ్టీ..

నేరుగా ‘TRS’ అని పెడితే ఈసీ అభ్యంతరం చెబుతుంది. అందుకే చివరన ‘Association’ అని చేర్చి, అది కొత్త పార్టీ అని సాంకేతికంగా సరిపెట్టుకుంటూనే.. బయటకు మాత్రం ‘TRS’ పేరునే హైలైట్ చేస్తున్నారు.

పక్కా ప్లాన్..

బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వస్తాయని ముందే ఊహించిన కవిత, ఈ ‘అసోసియేషన్’ అనే పదాన్ని ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో కేవలం ‘టీఆర్ఎస్’ అని మాత్రమే వినిపించేలా, చట్టప్రకారం మాత్రం ‘టీఆర్ఎస్ఏ’ (TRSA) అని ఉండేలా ఆమె పక్కా ప్లాన్ వేశారు. మరి ఈ ‘అక్షర’ యుద్ధం ఈసీ వద్ద ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

TRS party

ఇది కూడా చదవండి..: TRS Party Name | కవిత పార్టీకి ‘TRS’ పేరు దక్కుతుందా? ఈసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *