Bheemgal Court | కోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : సీనియర్​ సివిల్​ జడ్జి శ్రీదేవి

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Court | కోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆర్మూర్ (Armoor Court)​ సీనియర్​ సివిల్​ జడ్జి శ్రీదేవి (Judge Sridevi) అన్నారు. పట్టణంలో నూతనంగా మంజూరైన కోర్టు భవన నిర్మాణ పనులను(court construction) ఆమె శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Bheemgal Court | గడువులోగా…

సివిల్​ జడ్జి నిర్మాణ పనుల నాణ్యతను, పురోగతిని తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి చైతన్య, సూర సురేష్, బార్ అసోసియేషన్(Bar Association) ప్రతినిధులు కె ప్రవీణ్ చందర్, జి సుదర్శన్, పి శంకర్, ఎంకే నాగరాజు, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఏఈ విక్రమ్, అంజల్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.

judge

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *