అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghunandan Rao Revanth Reddy | శ్రీరాముడు ధనికుల దేవుడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేవుళ్లను కూడా రాజకీయాల కోసం విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రీరాముడు రిచ్ గాడ్ (ధనికుల దేవుడు) అయితే, భద్రాచలం రాముడి వద్దకు తన సతీమణితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తలంబ్రాలు తీసుకువెళ్లారో సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తాము ద్రవిడులమని, శివుడిని కొలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్లారా? కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారా? అని ప్రశ్నించారు. బ్రిటిష్ వాడు చెప్పిన ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) సూత్రం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని, చివరకు దేవుళ్లలోనూ రాజకీయం చేయడం బాధాకరమన్నారు. నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో శైవక్షేత్రాలను సందర్శించారని, ‘హర హర మహాదేవ’ నినాదం గురించి తమకు ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Raghunandan Rao Revanth Reddy | దండయాత్రతో ఒరిగేదేమిటి?
మాజీ సీఎం కేసీఆర్ గతంలో గజ్వేల్‌కు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా గత మూడేళ్లుగా కొడంగల్ నియోజకవర్గానికే పరిమితమయ్యారని రఘునందన్ రావు విమర్శించారు. నిధులు, ప్రాజెక్టులన్నీ కొడంగల్‌కే తరలించుకుపోతున్న రేవంత్ రెడ్డికి.. ఇన్నాళ్లకు తెలంగాణలో సిరిసిల్లా అనే మరో నియోజకవర్గం ఉందని గుర్తుకురావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను సమానంగా చూడాలని, రాజకీయ లబ్ధి కోసం ఓ నియోజకవర్గంపై దండయాత్ర చేస్తామనడం బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా తెలివితక్కువతనమే అవుతుందని మండిపడ్డారు. చేతనైతే రింగ్ రోడ్డు టెండర్ల కేసులోనో, ఫార్ములా ఈ-రేస్ కేసులోనో కేటీఆర్‌ను జైల్లో పెట్టాలి తప్ప.. వంద కార్లతో దండయాత్రకు వెళితే ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
Raghunandan Rao Revanth Reddy | అమిత్ షా రాక..
అక్టోబర్ 4వ తేదీన మెదక్ పార్లమెంట్ పరిధిలోని తూప్రాన్‌లో అమూల్ భారీ మిల్క్ బల్క్ యూనిట్ శంకుస్థాపనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని రఘునందన్ రావు వెల్లడించారు. ఇది జిల్లా రైతులకు పెద్ద శుభవార్త అని పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా.. అక్టోబర్ 6న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు (జాతీయ రహదారి 765 డీజీ) ఒకే రోజు 30 వేల బాదం మొక్కలు నాటి, సంరక్షించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Hyderabad, Telangana: On the Chief Minister Revanth Reddy’s statement, BJP MP Madhavaneni Raghunandan Rao says, “…You say BJP do politics in the name of religion. And then, the Congress Chief Minister is coming to Delhi and trying to create a conflict between Lord Ram and Lord… pic.twitter.com/W8e9R84VDE
— IANS (@ians_india) September 30, 2026
ఇది కూడా చదవండి: Oppo K14 Plus | ఆండ్రాయిడ్ 17 ఓఎస్‌తో ఒప్పో ఫోన్ లాంచ్.. అక్టోబర్ 8న సేల్ ప్రారంభం