అక్షరటుడే వెబ్‌డెస్క్: Balka Suman Bail | బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఇటీవలి కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో, హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Balka Suman Bail | కేసు నేపథ్యం..
నగరంలోని నాంపల్లిలో ఉన్న సింగరేణి భవన్, అలాగే మందమర్రిలోని సింగరేణి జీఎం కార్యాలయ అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సింగరేణి అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ఈ కేసులో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన బాల్క సుమన్‌కు బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో సుమన్ అరెస్టు అంశం గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లిలోని సింగరేణి భవన్‌తో పాటు మందమర్రిలోని జీఎం కార్యాలయ అధికారులను ఉద్దేశించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై సింగరేణి అధికారులు… pic.twitter.com/YuF9XSV461
— Akshara Today | Telugu News (@aksharatoday) June 24, 2026
ఇది కూడా చదవండి: Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలు.. ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం