Minister Seethakka Visit | 27న ఇందూరుకు మంత్రి సీతక్క రాక..

పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 27న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ ముప్పగంగారెడ్డి వివరాలు వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Minister Seethakka Visit | పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు నిజామాబాద్​ (Nizamabad) మార్కెట్​ కమిటీ (Market Committee) ఛైర్మన్​ ముప్పగంగారెడ్డి వివరాలు వెల్లడించారు.

Minister Seethakka Visit | గాంధీ గంజ్​.. శ్రద్ధానంద్​ గంజ్​లలో..

నగరంలోని మార్కెట్​యార్డ్​లో ఛైర్మన్​ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. శ్రద్ధానంద్ గంజ్​, గాంధీగంజ్​లలో(Gandhi Ganj) పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నిమిత్తం ఈనెల 27న జిల్లాకు మంత్రి సీతక్క రానున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి, తగు ప్రతిపాదనలను వ్యవసాయ మార్కెటింగ్​ శాఖకు పంపేందుకు తీర్మానించామన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్​ జంగిటి రాంచందర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *