తెలంగాణKTR Allegations | మా కెమెరాలు, ఫోన్లు హ్యాక్​ చేస్తున్నారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR Allegations | మా కెమెరాలు, ఫోన్లు హ్యాక్​ చేస్తున్నారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తమ సీసీ కెమెరాలు, ఫోన్లు హ్యాక్ చేయిస్తున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీ లా పని చేస్తున్నారని ఆరోపించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Allegations | బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి తమ సీసీ కెమెరాలు, ఫోన్లు హ్యాక్ చేయిస్తున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీ లాగా పని చేస్తున్నారని ఆరోపించారు.

సంగారెడ్డి జైలులో ఉన్న బీఆర్ఎస్​ నాయకుడు మన్నె క్రిశాంక్ (Manne Krishank)​ను సోమవారం ఉదయం కేటీఆర్​ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడిని బయటకు తెచ్చిన మన్నె క్రిశాంక్‌ గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను బయట పెట్టినందుకు 35 కేసులు పెట్టారని ఆరోపించారు.

KTR Allegations | పాలనపై దృష్టి పెట్టాలి

బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకుల మీద రేవంత్ రెడ్డి (Revanth Reddy) పెట్టిన శ్రద్ధలో ఒక పైసా భాగం అయినా రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలపై పెట్టాలని కేటీఆర్​ కోరారు. రేవంత్ రెడ్డి ఇంతకు ఇంతా చెల్లించుకుంటారని, ఇవ్వన్నీ బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. కరీంనగర్​లో ఉదయం జ్యువెల్లరి షాప్​లో కాల్పులు జరిగాయన్నారు. వీటి గురించి పట్టించుకోని సీఎం, సోషల్​ మీడియాలో ఎవరు ఏం పోస్టులు పెడుతున్నారని ఆరా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

KTR Allegations | అండగా ఉంటాం

మన్నె క్రిశాంక్​ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు చెప్పినా.. అరెస్ట్ చేశారన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవేమీ పట్టించుకోని సీఎం సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ సోషల్ మీడియా (BRS Social Media) వారియర్లకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

India Election Shocks| సొంత నియోజకవర్గాల్లో వెనుకబడ్డ హేమాహేమీలు.. ముగ్గురు సీఎంలకు షాక్.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Election Shocks| పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి...

Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavita Farmers Support | ఆదిలాబాద్ జిల్లా...

X Money App | ‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : X Money App | ఎలాన్ మస్క్...

Kerala Political Update | కమ్యూనిస్ట్​ల పని ఖతం.. కేరళంలో కాంగ్రెస్​ జోరు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kerala Political Update | దేశంలో కమ్యూనిస్ట్​ పార్టీ...