Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలు.. ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Khamenei Funeral | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల (జులై) 5 నుండి 9వ తేదీ వరకు ఈ అంత్యక్రియల కార్యక్రమాలు జరగనున్నాయి. ముందుగా టెహ్రాన్ , ఖోమ్ నగరాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి, చివరిగా 9వ తేదీన ఆయన స్వస్థలమైన మషాద్‌లో ఖమేనీని ఖననం చేయనున్నారు.

Khamenei Funeral | ప్రధాని మోదీకి ఆహ్వానం..

ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఆహ్వానించినట్లు దౌత్య వర్గాల సమాచారం. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్ తరపున ఈ కార్యక్రమానికి ఎవరిని పంపాలనే విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు మరో 40 మంది ఉన్నతాధికారులు మరణించారు. ఈ ప్రమాదంలో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Khamenei Funeral | భారత్-ఇరాన్ సంబంధాలు..

ప్రధాని మోడీ, ఇరాన్ నాయకత్వంతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. 2016లో మోడీ ఇరాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఖమేనీని కలిశారు. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్‌ను సందర్శించారు. ఇటీవలే 2024 అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీ, పెజిష్కియాన్‌లు సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో, భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి:  Indur Oora Pandaga | ఇందూరు ఊర పండుగ.. గద్దెల పెంపునపై ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రత్యేక దృష్టి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *