Chittoor GST Scam | భారీ జీఎస్టీ స్కామ్ .. అమాయకుల పేర్లతో వందల కోట్ల దందా

చిత్తూరు జిల్లాలో బయటపడిన భారీ జీఎస్టీ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Chittoor GST Scam | చిత్తూరు జిల్లాలో బయటపడిన భారీ జీఎస్టీ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. స్క్రాప్ వ్యాపారం పేరుతో అమాయకుల వ్యక్తిగత పత్రాలను దుర్వినియోగం చేస్తూ, కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు సంచలనాత్మక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Chittoor GST Scam | అమాయకులే లక్ష్యంగా ..

చిన్న వ్యాపారులు, సామాన్యులకు కొంత డబ్బు ఆశ చూపి వారి ఆధార్, పాన్ కార్డులను సేకరించిన ముఠా.. వారి పేర్లతో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ ఖాతాలు తెరిచింది. అనంతరం బాధితులకు తెలియకుండానే వారి ఖాతాల ద్వారా వందల కోట్ల రూపాయల స్క్రాప్ లావాదేవీలు నడిపారు. ఇటీవల జీఎస్టీ అధికారులు ఏకంగా కోట్ల రూపాయల పన్ను చెల్లించాలని నోటీసులు పంపడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Chittoor GST Scam | అరెస్ట్.. ఆపై స్టేషన్ బెయిల్..

రంగారెడ్డి జిల్లాకు  ( Ranga Reddy ) చెందిన సయ్యద్ సమీర్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన పత్రాలను అక్రమంగా వాడుకొని జీఎస్టీ మోసానికి పాల్పడ్డారని ఆయన పలమనేరు పోలీసులను ఆశ్రయించారు. దీని ఆధారంగా ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న చిత్తూరుకు చెందిన రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, గత ఏడేళ్లుగా సాగుతున్న ఈ అక్రమాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల రాబడి గండి పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతటి భారీ స్కామ్‌లో నిందితుడైన రెహమాన్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందల కోట్ల కుంభకోణంలో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని స్థానికులు, బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ మోసం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్ ఎంత పెద్దది? ఇందులో ఇంకా ఎంతమందికి భాగస్వామ్యం ఉందనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Telangana Municipal Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. త్వరలో మున్సిపల్​ శాఖలో 886 పోస్టుల భర్తీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *