Kavitha Ricky Radhan Meeting | కవిత ఇంట్లో విజయ్ జ్యోతిష్యుడు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ చీఫ్ కవిత పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KKavitha Ricky Radhan Meeting | మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ చీఫ్ కవిత పార్టీని మరింత బలోపేతం చేసేందుకు  శ్రమిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురు ప్రముఖులతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ( Tamil Nadu )ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడిగా పేరుగాంచిన రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేట్… నేరుగా కవిత నివాసానికి వచ్చి ఆమెను కలవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

Kavitha Ricky Radhan Meeting | రిక్కీ రాధన్‌తో ఫొటో..

ఈ భేటీకి సంబంధించి కవిత, ఆమె కుమారుడు రిక్కీ రాధన్‌తో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోవడంతో, కవిత భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. తమిళనాట జ్యోతిష్యుడిగా ప్రసిద్ధి చెందిన రిక్కీని, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక కర్తవ్య అధికారిగా నియమించారు. అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి:  Girl Murder Case | పూణేలో దారుణం… 9 ఏళ్ల బాలికపై హత్యాచారం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *