అక్షరటుడే వెబ్‌డెస్క్: Jana Sena Meeting | జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 15న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. “సేన ప్రస్థానం… జాతీయ సమైక్యత కోసం” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరగనుంది.
Jana Sena Meeting | సమావేశ ముఖ్య ఉద్దేశ్యం..
పార్టీ స్థాపించి పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తయిన నేపథ్యంలో, జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ప్రాంతీయతకు విలువనిస్తూనే, జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలనే దానిపై ఆయన నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Jana Sena Meeting | పాల్గొనే ప్రతినిధులు..
ఈ సమావేశానికి పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలను ఆహ్వానించారు. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ నామినేట్ చేసిన కార్పొరేషన్ ఛైర్మన్లు , ఇతర కీలక నేతలు హాజరవుతారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.
Jana Sena Meeting | సమయం , వేదిక..
సోమవారం (జూన్ 15) ఉదయం ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఈ సమావేశం ప్రారంభమై, సాయంత్రం వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ నేతలు ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం
•సేన ప్రస్థానం… జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని…
— JanaSena Party (@JanaSenaParty) June 14, 2026
ఇది కూడా చదవండి: Sadaram Dates | సోషల్ మీడియాలో సదరం తేదీలపై ఫేక్ ప్రచారం.. నమ్మొద్దని డీఆర్డీవో సూచన