Karnataka Betting | రూ. 500 బెట్టింగ్ వ్యవహారం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం!

Shivam nagarani

అక్షరటుడే,బెంగళూరు: Karnataka Betting | కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర (G. Parameshwara), డిప్యూటీ కమిషనర్ శుభా కళ్యాణ్‌లకు కోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది జరిగిన ఒక కబడ్డీ మ్యాచ్‌పై పందెం కాసిన వ్యవహారంలో వారిద్దరిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని బెంగళూరులోని 42వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు (Magistrate Court) పోలీసులను ఆదేశించింది.

Karnataka Betting | రూ. 500 పందెం :

గత సంవత్సరం తుమకూరులో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో దక్షిణ కన్నడ జిల్లా జట్టుపై మంత్రి పరమేశ్వర, డీసీ శుభా కళ్యాణ్ (DC Shubha Kalyan) రూ. 500 పందెం కాశారు. ఆ మ్యాచ్‌లో దక్షిణ కన్నడ జట్టు గెలవడంతో, తాను పందెం ఓడిపోయానంటూ హోంమంత్రి అప్పట్లో మీడియా ముందు సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బెట్టింగ్‌కు పాల్పడటం చట్టవిరుద్ధమని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

Karnataka Betting | ఆధారాలు లేవని:

గతంలో కొడిగెహళ్లి పోలీసులు ఈ ఫిర్యాదును ఆధారాలు లేవని కొట్టివేశారు. దీనిపై న్యాయమూర్తి కేఎన్ శివకుమార్ స్పందిస్తూ.. వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను, మంత్రి స్వయంగా చేసిన ప్రకటనను పోలీసులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తూ కేసు నమోదుకు ఆదేశాలిచ్చారు.

Karnataka Betting

Karnataka Betting | ముందస్తు అనుమతి అవసరం లేదు:

బెట్టింగ్ అనేది అధికారుల అధికారిక విధులకు సంబంధించింది కాదు కాబట్టి, విచారణకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 30, 2026న జరగనుంది.

ఇది కూడా చదవండి..: Water Bell | ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో వాటర్​బెల్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *