అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UAE Indian Billionaires | 2026లో యూఏఈలోని అత్యంత సంపన్న(బిలియనీర్) నివాసితుల జాబితాలో తొమ్మిది మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. వీరి సంయుక్త సంపద 49.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ (Forbes Middle East) తాజాగా విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
UAE Indian Billionaires | స్వర్గధామంగా యూఏఈ ఓ
ఈ జాబితాలో ఐదు దేశాలకు చెందిన 17 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరందరి సంపద విలువ 212.6 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. సంపన్న పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార నాయకులకు యూఏఈ ఓ స్వర్గధామంగా నిలుస్తోందని ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ పేర్కొంది. రిటైల్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో సేవలందిస్తూ తాము ఎదుగుతూ, యూఏఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ భారతీయ వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జాబితాలోని వారి వివరాలు తెలుసుకుందామా..
UAE Indian Billionaires | అత్యంత సంపన్నుల జాబితాలో తొమ్మిది మంది భారతీయులు
వినోద్ అదాని : 20.8 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్‌నకు సంబంధించిన ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా ఆయన సంపద పెరిగింది.
ఎంఏ యూసఫ్ అలీ : లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ అధినేత. ఈయన సంపద 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
రేణుక జగతియాని : లాండ్‌మార్క్ గ్రూప్ చైర్‌పర్సన్ అయిన ఈమె సంపద విలువ 5.6 బిలియన్ డాలర్లు.
రవి పిళ్లై : ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈయన నికర సంపద 4.2 బిలియన్ డాలర్లు.
సన్నీ వర్కీ : జెమ్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు. ఈయన సంపద 4 బిలియన్ డాలర్లుగా ఉంది.
పీఎన్సీ మీనన్ : శోభా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈయన సంపద 3.9 బిలియన్ డాలర్లు.
కబీర్ ముల్చందాని : రియల్ ఎస్టేట్ దిగ్గజం, ఫైవ్ ీVAల్డింగ్స్ వ్యవస్థాపకుడైన ఈయన సంపద సుమారు 2.2 బిలియన్ డాలర్లు.
షంషీర్ వయలిల్ : బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. ఈయన సంపద 1.8 బిలియన్ డాలర్లుగా అంచనా.
ధృవ్ సాహ్నీ : త్రివేణి ఇంజినీరింగ్ , ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన సంపద విలువ 1.6 బిలియన్ డాలర్లని అంచనా.
ఇది కూడా చదవండి..: Telangana Irrigation Projects| నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి: కవిత

