అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Municipal Jobs | రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మున్సిపల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.
తెలంగాణ (Telangana)లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ పరిధిలో వార్డు అధికారులు (Ward Officers) నుంచి గ్రేడ్-2, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ల వరకు మొత్తం 886 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2027 జనవరిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ (TGPSC) ద్వారా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Telangana Municipal Jobs | పోస్టుల వివరాలు
ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో గ్రేడ్ –3 కమిషనర్ పోస్టులు 20, 11 డిప్యూటీ కమిషనర్, 86 జూనియర్ అసిస్టెంట్, 56 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 40 హెల్త్ అసిస్టెంట్, 40 జూనియర్ అకౌంటెంట్, 40 సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పలు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. వాటిలో సిబ్బంది కొరత నెలకొంది. దీంతో డిప్యుటేషన్లతో నెట్టుకొస్తున్నారు. పోస్టులను భర్తీ చేస్తే ఆయా బల్దియాల్లో సిబ్బంది కొరత తీరనుంది.
ఇదికూడాచదవండి: BC Chief Minister | తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి: పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్