అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Janwada Farmhouse |జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తాము ఏదైనా తప్పుచేసినట్టు తేలితే.. ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధం అని తెలిపారు.
కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ నాయకులు శనివారం పరిశీలించిన విషయం తెలిసిందే. భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన స్పందించారు. అధికారం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
KTR Janwada Farmhouse |ఎండుతున్న పంటలు
వర్షాలు, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సరిపడ విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. దీంతో పారిన మడే మళ్లీ పారుతుందని, ఇంకో మడికి నీరు వెళ్లడం లేదన్నారు. బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామ రైతులే కరెంటు రావడం లేదని రోడ్డెక్కుతుంటే.. డిప్యూటీ సీఎం మాత్రం ఎల్ నినో వల్ల కరెంటు రావడం లేదంటున్నారని విమర్శించారు. ఎల్ నినో వల్ల కాదు.. ముఖ్యమంత్రికి తెలివి లేక రైతులను అవస్థలు పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KTR Janwada Farmhouse |ముందు చూపు లేక
కృష్ణా నదిలో తెలంగాణకు 248 టీఎంసీల వాటా ఉందని కేటీఆర్ అన్నారు. అయినా నేడు జూరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. నీళ్లు ఉండి ఇవ్వలేదని, కరెంట్ ఉన్నా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 టీఎంసీలకుపైగా నీళ్లు ఏపీకి వెళ్లాయని ఆరోపించారు. ఎల్‌నినోపై 6 నెలల ముందే హెచ్చరికలు వచ్చినా.. కాంగ్రెస్ ముందుచూపు లేకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాళేశ్వరం పంపులు ఎందుకు ఆన్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు రావడం కష్టమేనని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి సొంత గ్రామ రైతులు కరెంటు రావడం లేదని రోడ్డు ఎక్కుతున్నారు
డిప్యూటీ సీఎం ఎల్ నినోతో కరెంటు రావడం లేదని అంటున్నాడు
ఎల్ నినో వల్ల కాదు.. ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి తెలివిలేక కరెంటు ఇవడం లేదు
– కేటీఆర్ https://t.co/HrVfveEyyb pic.twitter.com/fyK9GWNfcI
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2026
దీనిని కూడా చదవండి : Home Guard Arrested | మహిళపై దాడి చేసిన హోమ్‌గార్డు అరెస్ట్