అక్షరటుడే వెబండెస్క్: Kavitha Demands Lookout Notice | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి , పోలీసు శాఖకు కీలక డిమాండ్లు చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా తక్షణమే విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఆమె కోరారు. అదే సమయంలో, రాజకీయ కక్షలతో బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kavitha Demands Lookout Notice | నిందితుడు దేశం దాటకుండా కట్టడి చేయాలి..
సాధారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని దేశం దాటించడం బీజేపీకి ఉన్న అలవాటని కవిత విమర్శించారు. బండి సంజయ్ కుమారుడు కూడా విదేశాలకు వెళ్లకుండా అన్ని ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టాలని, లుకౌట్ నోటీసులు జారీ చేయాలని పోలీసులను కోరారు. ఇలా చేయడం వల్ల మాత్రమే విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం తెలంగాణ మహిళల్లో కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.
Kavitha Demands Lookout Notice | బాధితురాలి ప్రైవసీ ముఖ్యం..
ఈ కేసులో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. మైనర్ బాలిక విషయంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని హితవు పలికారు. “మగపిల్లలను ఈ సమాజం క్షమిస్తుంది కానీ, ఒక్కసారి ఫోటోలు బయటకు వస్తే ఆడపిల్ల జీవితం పూర్తిగా నాశనమవుతుంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Kavitha Demands Lookout Notice | సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్లే బాధితురాలి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయని, ఇది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడమేనని కవిత విమర్శించారు. ఇలాంటి పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కేవలం రాజకీయాల కోసం ఆడపిల్లల జీవితాలను పణంగా పెట్టకూడదని స్పష్టం చేశారు.
Kavitha Demands Lookout Notic | పోలీసులకు డిమాండ్..
ముఖ్యమంత్రిపై చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఒక ఆడపిల్ల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్న అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయడం లేదని ఆమె నిలదీశారు. బాధితురాలి వివరాలను బహిర్గతం చేసిన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Vijay OSD | వెనక్కి తగ్గిన విజయ్.. ఓఎస్డీ నియామకం రద్దు

