Vijay OSD | వెనక్కి తగ్గిన విజయ్​.. ఓఎస్​డీ నియామకం రద్దు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay OSD | తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్​ విజయ్​ (Tamilnadu CM Joseph Vijay) వెనక్కి తగ్గారు. ఓఎస్​డీ నియామకాన్ని రద్దు చేశారు. ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలు, అసెంబ్లీలో నిరసనల నేపథ్యంలో జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి ఓఎస్​డీ (రాజకీయ)గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) ఉపసంహరించుకుంది.

ముఖ్యమంత్రి విజయ్‌కు (OSD)గా జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియమించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు విజయ్​ తీరుపై మండిపడ్డారు. ఓ జోతిష్యుడిని ఓఎస్​డీగా నియమించి, కేబినెట్​ హోదా ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. మరోవైపు బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్షాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో బుధవారం సభ ముగియగానే విజయ్​ ప్రభుత్వం ఓఎస్​డీ ఆయన నియామకాన్ని రద్దు చేసింది.

Vijay OSD | రాజకీయ నాయకులకు సలహాలు

వెట్రివేల్ తమిళనాడులో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారుడిగా పరిగణించబడతారు. గత కొన్నేళ్లుగా పలువురు ప్రభావవంతమైన రాజకీయ నాయకులు ఆయన సలహాలను తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ పరిశీలకులు తరచుగా ఆయనను మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితతో ముడిపెడుతూ ఉంటారు. ఆమె ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునే ముందు ఆయనను సంప్రదించేవారని కూడా వారు చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ముందే వెట్రివేల్ విజయ్ ఎన్నికల విజయాన్ని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయనను విజయ్​ ఓఎస్​డీగా నియమించారు. విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వును రద్దు చేశారు.

ఇది కూడా చదవండి..: BJP Leader Rally | ప్రధాని మాట పట్టించుకోని బీజేపీ నేత.. 50 కార్లతో ర్యాలీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *