Gold Price Hike | సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. ఒకేరోజు రూ.వేలల్లో పెరుగుదల

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Hike | పసిడి కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్లీ కొండెక్కింది. కామారెడ్డిలో (Kamareddy) ఇవాళ తులం రేటు అక్షరాల రూ.1,58,800 లకు చేరింది. నిన్నమొన్నటి వరకు రూ.1.52 లక్షలు ఉన్న ధర ఒక్కసారిగా రూ.6 వేలు ఎగబాకడంతో (kamareddy gold rates) జనం జంకుతున్నారు.

Gold Price Hike | అందకుండా పోతున్న వెండి..

వెండి కూడా సామాన్యుడికి అందకుండా పోతోంది. రూ.2,500 వద్ద ఉన్న వెండి ఇవాళ రూ.2,730కి చేరి షాక్ ఇచ్చింది. పెళ్లిళ్ల సీజన్‌లో ఇలా రేటు మంట పుట్టించడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కస్టమ్స్​ డ్యూటీని పెంచడంతో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఇటీవల హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) ‘ఏడాది పాటు బంగారం జోలికి వెళ్లవద్దు’ అని సూచించిన విషయం తెలిసిందే. బంగారం కొనుగోళ్లను తగ్గించే చర్యల్లో భాగంగా కస్టమ్స్​ డ్యూటీని పెంచారు. రాబోయే రోజులు రేటు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Kavitha Demands Lookout Notice| బండి సంజయ్ కుమారుడికి లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *